ICC: 2027-29 డబ్ల్యూటీసీలో చిన్న దేశాలకు 4 రోజుల టెస్టులు! ఆ జట్లకు మాత్రమే!
Tue Jun 17, 2025 16:04 Sports
టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శ్రీకారం చుట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. సుదీర్ఘ ఫార్మాట్‌కు ఆదరణ పెంచే దిశగా, ముఖ్యంగా చిన్న దేశాలకు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో ఐసీసీ కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా, 2027-29 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) సైకిల్ నుంచి కొన్ని దేశాల మధ్య జరిగే టెస్ట్ మ్యాచ్‌లను నాలుగు రోజులకు కుదించాలని ఐసీసీ భావిస్తోంది. అయితే, క్రికెట్ ప్రపంచంలో పెద్దన్నలుగా పేరుగాంచిన భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి దేశాలు మాత్రం సంప్రదాయబద్ధంగా ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్‌లనే ఆడనున్నాయి. ఈ మార్పు ప్రధానంగా ఆర్థికంగా వెనుకబడిన, టెస్ట్ క్రికెట్‌ను ఎక్కువగా నిర్వహించలేని చిన్న దేశాలకు ఊరట కల్పించనుంది. ఐదు రోజుల మ్యాచ్ నిర్వహణకు అయ్యే అధిక వ్యయం, సమయం వంటి అంశాలు ఈ దేశాలకు భారంగా మారుతున్నాయి.
ఇది కూడా చదవండి: Air India: ప్రమాదం తర్వాత ఫస్ట్ ట్రిప్.. అహ్మదాబాద్-లండన్ ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. చివరి నిమిషంలో?
నాలుగు రోజుల ఫార్మాట్ ద్వారా నిర్వహణ వ్యయం తగ్గడమే కాకుండా, తక్కువ సమయంలో సిరీస్‌లను పూర్తి చేసే అవకాశం లభిస్తుంది. ఉదాహరణకు, మూడు టెస్టుల సిరీస్‌ను మూడు వారాల్లోపే ముగించవచ్చు. గత వారం లార్డ్స్‌లో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ సందర్భంగా సభ్యదేశాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఐసీసీ చైర్మన్, బీసీసీఐ కార్యదర్శి జై షా ఈ నాలుగు రోజుల టెస్ట్ ప్రతిపాదనకు మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. ఐసీసీ 2017లోనే ద్వైపాక్షిక సిరీస్‌లలో సభ్యదేశాల పరస్పర అంగీకారంతో నాలుగు రోజుల టెస్టులు ఆడుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ క్రమంలోనే గతంలో ఇంగ్లండ్ జట్టు ఐర్లాండ్‌తో (2019, 2023), జింబాబ్వేతో (2017) నాలుగు రోజుల టెస్టులు ఆడింది. నాలుగు రోజుల టెస్టుల్లో ప్రతిరోజూ ప్రస్తుతం ఉన్న 90 ఓవర్లటకు బదులుగా 98 ఓవర్ల ఆటను నిర్వహించే అవకాశం ఉంది, తద్వారా మ్యాచ్ ఫలితం తేలే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. కాగా, 2025-27 డబ్ల్యూటీసీ సైకిల్ మాత్రం యధావిధిగా ఐదు రోజుల ఫార్మాట్‌లోనే కొనసాగుతుందని ఐసీసీ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Adabidda nidhi Scheme: ఏపీ మహిళలకు శుభవార్త.. నెలకు రూ. 1500పై కీలక అప్‌డేట్! ఈ పథకం త్వరలోనే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Rythu Bharosa: రైతన్నలూ.. బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి! పంట పండించే ప్రతి ఎకరాకు!
Chandrababu warning Jagan: పులివెందుల రాజకీయం చేస్తే.. తోక కట్ చేస్తా! ఎవరు తప్పు చేసినా..
అధికారులు అలర్ట్.. చంద్రబాబు హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు! విశాఖపట్నంలో సీఎం పర్యటన..
ఏసీబీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తతలు! మాజీ మంత్రికి మద్దతుగా వచ్చిన కార్యకర్తలు అరెస్ట్!
ఆ జిల్లా టమాటా రైతులపై ఊజీ ఈగ పిడుగు! దీంతో కొనేవారే..
సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్! FDలపై గరిష్ఠ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు!
అసైన్డ్ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!
తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!
ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!
ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!
సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమా, న్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Sports #teamindia #ICC #4Days #Selectteams #cricket
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.